ఎంఎస్ వోలకు వ్యతిరేకంగా హైకోర్టులో పిల్
తెలంగాణలో టీవీ 9, ఏబీఎన్ ఛానెళ్లను ఆపేసిన ఎంఎస్ వోలకు వ్యతిరేకంగా హైకోర్టులో పిల్ దాఖలైంది. వెంకటనారాయణ అనే వ్యక్తి ఈ పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణలో ఎంఎస్ వోలు చట్టవిరుద్ధంగా ఛానెళ్లను నిలిపేశారని వెంకట నారాయణ పిటిషన్ లో పేర్కొన్నారు. దీనిని హైకోర్టు విచారణకు స్వీకరించింది.